‘ప్రతి భారతీయుడి బ్యాంకర్’ అనే పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోని ‘టాప్- 20’ బ్యాంకుల్లో స్థానం సంపాదించాలనేది ఈ బ్యాంకు ఉద్దేశం.
తెలంగాణ కమలదళానికి కొత్త సారథి ఎన్నికపై గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్ష పదవి రేసులో అనేక పేర్లు వినిపించినా.. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావుకే జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది.
ఐఏఎస్ అధికారులైన గవర్నర్ కార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణలు సోమవారం పదవీ విరమణ చేయగా, వారిని మళ్లీ అవే స్థానాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ పరిధిలోని అన్ని సంక్షేమ విభాగాలు, యాజమాన్య విద్యా సంస్థలకు చెందిన గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు డైట్ ఛార్జీల పెంపుపై సాంఘిక సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఎంబైపీసీ, ఎంపీసీతో జీవశాస్త్రం సబ్జెక్టు చదువుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ విద్యామండలి కల్పించినా వీటిని చాలా కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉంచడంలేదు. ఇంటర్మీడియట్లో విద్యార్థులు గ్రూపులు, సబ్జెక్టుల ఎంపికకు వెబ్‌సైట్‌ను మండలి అందుబాటులోకి తీసుకొచ్చింది.
మూడు నెలల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిత్తూరు జిల్లా పెద్ద పంజనికి చెందిన రామకృష్ణ వాపోయారు. వారిని శిక్షించి, తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
వైకాపా ప్రభుత్వంలో.. ఇతర గుత్తేదారులను కాదని, తన పలుకుబడి ఉపయోగించి ఓ గుత్తేదారు రూ.48 కోట్ల బిల్లులు పొందేందుకు ప్రయత్నించారు. గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా ఈ తతంగం జరగ్గా, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో.. చివరి నిమిషంలో చెల్లింపులు ఆగాయి.
ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేశారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, మరో ఇద్దరు పోలీసు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.
రాజధాని అమరావతి ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మురికి వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు, పాత్రికేయుడు కృష్ణంరాజుకు హైకోర్టు షరతులతో బెయిలు మంజూరు చేసింది. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది.
శ్రీశైలం ప్రాజెక్టులో మరమ్మతులు, భద్రతపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఛైర్మన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన దరిమిలా.. రాష్ట్ర జలవనరుల శాఖ చర్యలకు ఉపక్రమించింది. రెండు కీలక పనులకు టెండర్లు పిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావు తెలిపారు.
విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం, బాల్య వివాహాల నియంత్రణ, స్వీయ రక్షణ, ఉపాధి అవకాశాలు తదితర కీలక అంశాలపై విద్యార్థులకు పాఠశాల దశ నుంచే అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వామపక్ష పార్టీల సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన విద్యుత్తు ఛార్జీలపై ఉద్యమించాలని నిర్ణయించింది. వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు పి.ప్రసాద్ అధ్యక్షతన సోమవారం విజయవాడలో నిర్వహించారు.
వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ పనుల ఆలస్యంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేస్తున్న ఏజెన్సీలకు, బాధ్యులైన అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు
ఉద్యోగం వస్తుందో రాదో..? వచ్చినా ఎంత కాలం ఉంటుందో?సవాళ్ల తీరాలను దాటగలమో లేదో? అంటూ కొలువుల వేటలో పరుగులు పెడుతూ.. తీవ్ర వేదనకు లోనవుతున్నారు చాలామంది యువత! కొందరు మాత్రం తమ అభిరుచికి సృజనాత్మకతను చేర్చి.. కోట్లు సంపాదిస్తూ.. అబ్బురపరుస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు విజయవాడకు చెందిన యువకుడు! తోటివారికీ తోడై నిలుస్తున్నారు!!
బుడమేరు వరద నివారణకు నిర్మించతలపెట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణాన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఆ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట అధికారులు తొలగిస్తే, తిరిగి పెట్టించేలా యంత్రాంగాన్ని కదిలించాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు. తన తల్లి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి, చివరికి ఇంటిల్లిపాది చనిపోదాంరా నాన్నా అంటే తట్టుకోలేని ఆ బిడ్డ.. ప్రభుత్వాన్నే తట్టిలేపాడు.
ఉత్తరాఖండ్ వేదికగా ఇటీవల జరిగిన 38వ జాతీయ క్రీడాపోటీల్లో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుందని శాప్ వెల్లడించింది. ఆ మేరకు రూ.91.75 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ కేవలం ఆరు గంటల్లో చేరుకునేలా యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సాలూరు, కోరాపుట్, జయపురల మీదుగా, లేకపోతే బొబ్బిలి, పార్వతీపురం, రాయగడల వైపు నుంచి రాయ్పుర్నకు రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రజలకు అధునాతన కంటి వైద్య సేవలు అందిస్తున్నామని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు వెల్లడించారు.
అనకాపల్లిలో అర్సెలార్ మిత్తల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారంలో రైల్వే స్లైడింగ్ సదుపాయం కోసం 111 ఎకరాల భూమిని సేకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రసంగిస్తారు.
తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని డోలపేటకు చెందిన ఉపాధ్యాయుడు డోల వాసుదేవరావును విద్యాశాఖ మంత్రి లోకేశ్ అభినందించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ పెట్టారు.
‘కాంగ్రెస్ సిద్ధాంతాలపై గౌరవం, నాయకత్వంపై నమ్మకం, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునేవారు కాంగ్రెస్‌లో చేరండి. వారికి పార్టీ మంచి వేదికగా నిలుస్తుంది. కాంగ్రెస్‌కు అన్నీ ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకత్వ లేమి ఉంది. అందుకే బహిరంగంగా అడుగుతున్నా పార్టీని బలోపేతం చేయండి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యర్థించారు.
ఆహార కల్తీకి అడ్డుకట్ట వేయడం.. నాణ్యమైన మందులను సరసమైన ధరలకు అందించడం.. వైద్య విద్య నాణ్యత పెంపు అంశాలపై నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
అనంతపురం జిల్లాలో సీఐ సాయిప్రసాద్ గన్ చూపిస్తూ హెచ్చరించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం అకస్మాత్తుగా తాడిపత్రికి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వృత్తి నైపుణ్యం గల శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్లో సోమవారం వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సమీక్ష నిర్వహించారు.
దళితుడు సింగయ్య మృతికి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక వాస్తవాలను ధ్రువీకరించింది.
పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీని ప్రధాన కుట్రదారులు, సూత్రధారులు, పాత్రధారులు అంతా కుమ్మక్కై కొల్లగొట్టిన సొమ్ములో కొంతభాగం ఏయే బ్యాంకు ఖాతాల్లో ఉందో సిట్ కనిపెట్టింది. తొలిదశలో రూ.30 కోట్ల వరకు జప్తు చేసేందుకు (ఎటాచ్మెంట్) చర్యలు ప్రారంభించింది.
కేరళ డీజీపీగా ఏపీకి చెందిన రావాడ అజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం. చంద్రశేఖర్ 1991వ బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లో, జలాశయాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వరదలు సంభవిస్తున్నాయి.
పట్టణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖలకు సంబంధించిన 250 రకాలైన సేవలు అందించే క్రమంలో డిజి లక్ష్మి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,034 సాధారణ సేవా కేంద్రాలు (కామన్ సర్వీస్ సెంటర్లు-సీఎస్సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను త్వరలో పెంచనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సోమవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ను జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనుంది.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం.. భారతదేశ శాస్త్రీయ, నవకల్పనలకు (ఇన్నోవేషన్) సంబంధించిన ప్రయాణంలో కీలక మైలురాయిగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు.
‘పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు తొలుత కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోవాలి. పర్యావరణ మదింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు ఇది పూర్తి చేయండి. ఆ తర్వాత పర్యావరణ మదింపునకు అవసరమైన టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు) ప్రతిపాదనలతో రండి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా.. అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ మ్యాప్‌లో నిలబెడతామని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ‘రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ క్వాంటమ్ లక్ష్యాలకు ఆంధ్రప్రదేశ్ మేధో రాజధానిగా నిలవబోతోంది.
భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (పీవీఎన్ మాధవ్) పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి భాజపా రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ పదవులను మాధవ్ నిర్వహించారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రూ.5 వేల కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వర్క్‌షాప్‌లో ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్’ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘‘క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతిని ‘ప్రపంచానికి మార్గదర్శి (లైట్ హౌస్)’గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.
అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ విధివిధానాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్ నిర్వహించింది.
తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
Banakacherla పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్
వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
ప్రజల వైద్య అవసరాల రీత్యా మంగళగిరి ఎయిమ్స్‌కి చేరుకోవడానికి మంగళగిరి(ఎన్‌హెచ్-16) వద్ద ఉన్న ఎంట్రీ ర్యాంప్‌ను ఎగ్జిట్ ర్యాంప్‌గా మార్చేందుకు కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తొమ్మిది జాతీయ మిషన్లలో క్యాంటం టెక్నాలజీ విప్లవం ఒకటి అని, అందుకే నేషనల్ క్యాంటం మిషన్ ఏర్పాటు అయిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు.
మాస్టారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లొద్దంటూ ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు బోరును విలపించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయపేట మండలం పి.కందిపూడి ప్రభుత్వ పాఠశాలలో శ్రీరాములు, రమణలు మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులుగా రెండేళ్లుగా పనిచేస్తున్నారు.
PVN Madhav బీజేపీ ఆంధ్రప్రదేశ్‌శాఖ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో నామినేషన్ వేశారు.